'భీష్మ' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకోగా.. తాజగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
హానీ సింగ్ ఎవరు?
మనీ రాబరీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా చెప్పేశారు. 'ఆగని హైఫై ఇళ్లల్లో చోరీలు' అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అవ్వగా.. డబ్బు, నగలు దోచుకునే సీన్స్ చూపించారు. డబ్బులు దోచుకుంటున్న హానీ సింగ్ ఎవరు? అనే డైలాగ్ ను బట్టి.. సినిమాలో నితిన్ ఈ పేరుతోనే దొంగతనాలకు పాల్పడతాడని అర్థమవుతుంది.
Your money is his honey..beware!#RobinhoodTeaser out now ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2024
▶️ https://t.co/iyKHse8nkV#Robinhood will deliver Christmas presents in theatres. Grand release worldwide on December 25th ✨
🌟ing @actor_nithiin & @sreeleela14@VenkyKudumula @gvprakash @MythriOfficial… pic.twitter.com/AZyMsO41ee
Also Read : ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్
టీజర్ లో శ్రీలీల గ్లామర్ తో పాటూ నితిన్, రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ ట్రాక్ హైలైట్ గా నిలిచింది. 'భారతీయులంతా నా సోదర సోదరీమణులు' అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజర్ లో యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమాలో నితిన్ రకరకాల గెటప్స్ తో కనిపించనున్నాడని టీజర్ లో చూపించారు.
అయితే ఆ దొంగతనాలు ఎందుకు? ఎవరి కోసం చేస్తున్నాడనే పాయింట్ ను సస్పెన్స్ గా ఉంచారు. మొత్తంగా 'రాబిన్ హుడ్' తో నితిన్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీగానే కనిపిస్తోంది. కాగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : భారీ ధరకు 'కంగువా' డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే, ఎప్పుడంటే?