జైభీం సినిమా సీన్ రిపీట్.. 8 మంది పోలీసులకు జీవితఖైదు

హిమాచల్ ప్రదేశ్‌లో జై భీం సీన్ రిపీట్ అయ్యింది. అత్యాచార కేసులో నిందితుడు పోలీసుల కస్టడీలో చనిపోయాడు. అతని స్థానంలో మరో వ్యక్తిని పోలీసులు చేర్చారు. ఈ కేసులో 8 మంది పోలీస్‌ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది.

New Update
jai bhem sean

jai bhem sean Photograph: (jai bhem sean)

హిమాచల్ ప్రదేశ్‌లో జైభీం సినిమాలో సీన్ రిపీట్ అయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చనిపోగా.. అతని ప్లేస్‌లో మరోవ్యక్తిని కేసులో ఇరికించారు పోలీసులు. ఈ కేసులో 8 మంది పోలీస్‌ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జి అల్కా మాలిక్ జనవరి 18న నిందితులను దోషులుగా తేల్చారు. జనవరి 27న శిక్ష ఖరారు చేశారు.

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో 2017 జూలై 4న 16 ఏళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హత్యచేసి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొట్ఖాయ్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఘటనకు బాధ్యులైన ఏడుగురిని గుర్తించి అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

సిట్‌ విచారణ జరగుతుండగా నిందితుల్లో ఒకడు సూరజ్‌ లాక్‌ప్‌లో మరణించాడు. దాంతో పోలీసులు అత్యాచారం కేసులో మరో నిందితుడైన రాజిందర్‌ ఈ కేసులో హంతకుడిగా చేర్చి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. విషయం బయటికి రావడంతో ప్రభుత్వం ఆ రెండు కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ అధికారులు సూరజ్‌ లాకప్‌ డెత్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ ఐజీ జహూర్‌ హైదర్‌ జైదీ సహా 8 మంది పోలీసులను నిందితులుగా చేర్చింది. డీఎస్పీ మనోజ్‌ జోషి, ఎస్సై రాజిందర్‌ సింగ్‌, ఏఎస్సై దీప్‌చంద్‌ శర్మ, హెడ్‌ కానిస్టేబుళ్లు మోహన్‌ లాల్‌, సూరత్‌ సింగ్, రఫీ మహ్మద్‌, కానిస్టేబుల్ రంజిత్‌ సతేరా ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు