జై భీమ్ సీన్ రిపీట్.. త్రీ టౌన్ పోలీసుల ఓవర్‌యాక్షన్
కర్నూల్ లో జై భీం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా బంధించి చేయని తప్పును ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు లాయర్‌ను ఆశ్రయించడంతో విషయం బయట పడింది.