భర్తలకు భార్యలు భయపడే రోజులు పోయి.. భర్తలు భయపడే రోజులు వచ్చాయి. భార్య ఇతరులతో రిలేషన్ పెట్టుకుని భర్తను ఎప్పుడు చంపేస్తుందనే భయంతో భర్తలు జీవిస్తున్నారు. నేటి కాలంలో భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు (27) అనే వ్యక్తికి మౌనికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.
ఇది కూడా చూడండి: Crime News: అనకాపల్లిలో అమానుషం.. గర్భిణిని చంపి.. శవాన్ని కాల్చి..!
ఏపీలో మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 15, 2025
https://t.co/g8zhTdW9d9pic.twitter.com/0hPBLgBBpI
మౌనికకు ఉదయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజుకు తెలియడంతో ప్రవర్తన మార్చుకోవాలని భార్యకు చాలాసార్లు హెచ్చరించాడు. దీంతో మౌనిక, ఆమె ప్రియుడు ఉదయ్‌తో కలిసి రాజును అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో రాజును చంపడానికి ప్లాన్ వేశారు. విషం పెట్టి రాజుని చంపేస్తే బెటర్ అని అనుకున్నారు. కానీ ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి రాజును హత్య చేశారు. రాత్రి సమయాల్లో మౌనిక రాజుకు నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. నిద్రలోకి జారిన తర్వాత గొంతు నులిమి దారుణంగా రాజును చంపేశారు.
భోజనంలో నిద్రమాత్రలు ఇచ్చి భర్తను చంపిన భార్య
— greatandhra (@greatandhranews) August 15, 2025
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంకు చెందిన మౌనిక తన భర్త అయినా రాజుకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది
ఇద్దరు పిల్లలు ఉన్నా.. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతకానికి పాల్పడింది pic.twitter.com/QmC0AVzmfm
యాక్సిడెంట్‌గా నమ్మించి..
హత్య చేసిన తర్వాత రాజు మృతి యాక్సిడెంట్ అని నమ్మించడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని ఒక చోటికి తీసుకువెళ్లి ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల విచారణలో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులకు అనుమానం రావడంతో మౌనిక, ఉదయ్, మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో, మౌనిక, ఉదయ్ తమ నేరాన్ని ఒప్పుకున్నారు. భర్తను చంపడానికి వారు వేసిన ప్లాన్, ఎలా హత్య చేశారో మొత్తం వివరాలను పోలీసులకు తెలిపారు. వివాహేతర సంబంధం కోసమే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Crime News: మైనర్ బాలికపై హత్యాచారం.. పోక్సో చట్టం కింద నిందితుడికి ఉరిశిక్ష
ఇదిలా ఉండగా ఇటీవల ముంబైలో ఇలాంటి తాజా ఘటన చోటుచేసుకుంది. ముంబైకి చెందిన భరత్, రాజశ్రీ భార్యాభర్తలు. వీరి పెళ్లయి 13 ఏండ్లు దాటింది. వీరి దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కూతుర్లు, ఇక కుమారుడు ఉన్నాడు. అయితే అన్యోన్యంగా సాగుతున్న వీరి దాపంత్యంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భర్త పని వెళ్లడం చూసి రాజశ్రీ కొంతకాలంగా చంద్రశేఖర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త భరత్ పాటు పిల్లలకూ తెలిసింది. ఈ విషయమై ఆమెను నిలదీశాడు. అయితే తన తప్పులేదని నమ్మించింది. అది నిజమని నమ్మిన భరత్ చంద్రశేఖర్ కు ఫోన్ చేశాడు. తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు. అప్పుడు చంద్రశేఖర్ కలిసి భరత్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలు అయినా భర్తను ఆసుపత్రికి తరలించలేదు. దీంతో భరత్ పరిస్థితి విషమించి మృతి చెందాడు.