Kakinada: మెడికల్ కాలేజీలో కామ పిశాచి.. సీరియస్ అయిన సీఎం చంద్రబాబు

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తి అసభ్య ప్రవర్తన చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులను నివేదిక కోరారు.

New Update

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది అసభ్య ప్రవర్తన చేసిన ఘటన చోటుచేసుకుంది. పారామెడికల్‌ స్టూడెంట్స్‌కు ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి వేధింపులకు గురిచేయడంతో 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారు. క్లాస్‌లో ఉన్నప్పుడే ఫొటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

తాగి వచ్చి అనుచిత ప్రవర్తన చేస్తున్నారని..

డైలీ తాగి వచ్చి స్టూడెంట్స్‌తో అనుచిత ప్రవర్తన చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఇతనికి సిబ్బంది జిమ్మి, ప్రసాద్‌, గోపాలకృష్ణ కూడా సపోర్ట్ చేస్తుంటారని స్టూడెంట్స్ కంప్లైంట్ చేయడంతో 10 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్‌ను కమిటీ సభ్యులు విచారణ చేపట్టి.. వేధింపులకు కారణమైన  నలుగురిపై డీఎంఈ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని సస్పెండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చంద్రబాబు ఆరోగ్య శాఖ అధికారులను నివేదిక కోరడంతో ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శరీరాన్ని తాకుతూ, బుగ్గలు నిమురుతూ వికృత చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు తెలిపారు.

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

తమ ఫోటోలు అసభ్యకరంగా తీసి, వన్ టైం వ్యూ ద్వారా వాట్సాప్‌కి పంపించే వారని కంప్లైంట్ చేశారు. రూంకి రమ్మని బెదిరించడం డబ్బులు ఇస్తానని అన్నారని, మద్యం సేవించి బూతులు తిట్టేవారని, తమ మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కమిటీ దృష్టికి విద్యార్థినులు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు