USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి

దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

New Update
bolivia

bolivia Photograph: (bolivia )

USA Road Accident: పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దక్షిణ అమెరికా బొలీవియా(South America Bolivia) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. డ్రైవర్ బస్సు నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది.

Also Read:  సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

Also Read:  మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో

అత్యంత తీవ్రమైన రోడ్డు ప్రమాదం..

పోటోసి, ఒరురో నగరాల మధ్య ప్రయాణిస్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు. బొలీవియాలో ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ఎందుకంటే ఇక్కడ అన్నీ కొండలు, లోయలతో కూడుకున్న రోడ్లు ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు దక్షిణ అమెరికా దేశంలో జరిగిన అత్యంత తీవ్రమైన రోడ్డు ప్రమాదం ఇదే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దాదాపు 12 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి సంవత్సరం సగటున 1,400 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు.

Also Read:  విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..

Also Read:  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు