BJP MLA: ముఖంపై మూత్రం పోసి, వైరస్ ఎక్కించి గ్యాంగ్ రేప్.. BJP ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

బెంగుళూర్ ఎమ్మెల్యే మునిరత్నం మహిళా కార్యకర్తపై సామూహిక అత్యాాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. అతని అనుచరులతో రేప్ చేయించి ముఖంపై మూత్ర విసర్జన చేశాడని, ప్రమాదకరమైన వైరస్ ఆమె శరీరంలోకి ఎక్కించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
BJP MLA Muniratnam

BJP MLA Muniratnam

బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మహిళా కార్యకర్తపై కర్కషంగా వ్యవహరించాడని ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు బాధిత మహిళ చేసింది. ఎమ్మెల్యే మునిరత్న ఆమె ముఖంపై మూత్ర విసర్జన చేశాడని, డేంజరస్ వైరస్ ఇంజక్షన్ చేశాడని, సామూహిక అత్యాచారానకి పాల్పడినట్లు 40ఏళ్ల బీజేపీ కార్యకర్త ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో బెంగళూరులోని ఆర్‌ఎంసి యార్డ్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 

బెంగళూరులోని యశ్వంత్‌పూర్ సమీపంలోని ఆర్‌ఎంసి యార్డ్ పోలీస్ స్టేషన్‌లో మే 21న ఫిర్యాదు నమోదైంది. 2023 జూన్ 11న యశ్వంత్‌పూర్ నుంచి 4-5 కి.మీ దూరంలో ఉన్న మత్తికెరెలోని మునిరత్న కార్యాలయంలో లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై పెట్టిన క్రిమినల్ కేసులకు కొట్టేపిస్తానని చెప్పి ఎమ్మెల్యే అతని అనుచరులతో అక్కడికి తీసుకెళ్లాడని చెప్పింది. ఆఫీసు లోపలికి వెళ్ళిన తర్వాత మునిరత్న, అతని ఇద్దరు అనుచరులతో ఆమె కొడుకుని చంపేస్తామని బెదిరించి అత్యాచారం చేయించాడని ఆరోపించింది. ఎమ్మెల్యే ఆమె ముఖంపై మూత్ర విసర్జన చేశాడని చెప్పింది. మరో వ్యక్తి ఓ ఇంజక్షన్ తీసుకొచ్చి మునిరత్న ఇవ్వాగా.. అది ఆమె ఒంట్లోకి ఎక్కించారని FIR పేర్కొంది. దీంతో ఈ ఏడాది జనవరిలో తాను ఆసుపత్రిలో చేరానని, నయం చేయలేని వైరస్ ఉన్నట్లు ఆమె శరీరంలో ఉన్నట్లు  నిర్ధారణ అయిందని ఆ మహిళ చెప్పింది. బీజేపీ ఎమ్మెల్యేపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

(BJP MLA Muniratnam | bjp-mla | bengaluru | activists | latest-telugu-news | crime news)

Advertisment
తాజా కథనాలు