/rtv/media/media_files/2025/05/03/opIq7eKqhInkS2uiExwA.jpg)
ecnounter bhopal
భోపాల్‌లో హిందూ బాలికలపై అత్యాచారం చేసిన లవ్ జిహాద్ ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఫర్హాన్ ను ఆసుపత్రిలో చేర్చారు. ఫర్హాన్ ఒక ముఠాను ఏర్పాటు చేసి హిందూ బాలికలపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిహాద్ ఉద్దేశ్యంతో హిందూ బాలికలను ప్రేమ ఉచ్చులో బంధించి అత్యాచారం చేసేవాడని నిందితుడు ఫర్హాన్ పై ఆరోపణలున్నాయి. అయితే పోలీసుల కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతని కాలికి బుల్లెట్ దిగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కస్టడీ నుంచి తప్పించుకునేందుకు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భోపాల్ లవ్ జిహాద్ కేసులో ప్రధాన నిందితుడిగాఉన్న ఫర్హాన్‌ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నప్పుడు అతను పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నిందితుడు ఫర్హాన్ మూత్ర విసర్జన చేస్తాననే నెపంతో పారిపోవాలనుకున్నాడు. అతను ఓ పోలీసు నుంచి పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో పోలీసులు అతనిపై ఎన్‌కౌంటర్ చేశారు, ప్రస్తుతానికి, అతను బతికే ఉన్నాడు.
నిందితుడు ఫర్హాన్ పై హిందూ కాలేజీ అమ్మాయిలను ప్రేమ ఉచ్చులోకి లాగడం, వారి అశ్లీల చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేయడం, ఆ తరువాత అత్యాచారం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. అతను జిహాద్ ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశాడని విచారణలో తేలింది. అతని ఏకైక లక్ష్యం వీలైనంత ఎక్కువ మంది హిందూ అమ్మాయిలను అత్యాచారం చేయడమే. దీనికోసం అతను ఒక సరైన ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్హాన్ ఈ నేరాన్ని ఒక ముఠాగా ఏర్పడి చాలా తెలివిగా హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు చేసేవాడు. ఒక హిందూ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read : Shivalik Sharma : ఆటగాడే.. ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ పై రేప్ కేసు
Also Read : Bull Riding Scooty: అలా ఎలా ఎక్కిందమ్మా.. స్కూటీ నడిపిన ఎద్దు (VIDEO) వైరల్