Crime: మనుషులను చంపి మొసళ్లకు మేత.. 50పైగా హత్యలు చేసిన ఆయుర్వేద వైద్యుడు శర్మ!

సీరియల్ కిల్లర్, ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 50కి పైగా హత్యలు చేసి ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీలను మొసళ్లకు మేతగా వేసినట్లు గుర్తించారు. 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్లకు పాల్పడ్డట్లు తెలిపారు.

New Update
devndr srm

Ayurvedic doctor, Serial killer Devender Sharma arrest

Crime: సీరియల్ కిల్లర్, ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 50కి పైగా హత్యలు చేసి ఆధారాలు దొరకుండా డెడ్ బాడీలను మొసళ్లకు మేతగా వేసినట్లు గుర్తించారు. 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్లకు పాల్పడ్డట్లు తెలిపారు. 

ఆర్థిక నష్టాలతో నేరాల బాట..

ఈ మేరకు 1994లో గ్యాస్‌ డీలర్‌షిప్‌ ఒప్పందం రద్దు కావడంతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన దేవేందర్‌ శర్మ నేరాల బాట పట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పలు కేసుల్లో తిహాడ్‌ జైలు నుంచి పెరోలుపై బయటకువచ్చి తప్పింకుచుని తిరుగుతున్న శర్మను రాజస్థాన్‌లోని దౌసాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ గుర్తింపు కార్డులతో ఓ ఆశ్రమంలో మారువేషంలో ఉండగా అరెస్టు చేశామని డీసీపీ ఆదిత్య గౌతమ్‌ చెప్పారు. 

Also Read: రూ.142 కోట్లు నొక్కేశారు.. రాహుల్‌, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు

మనుషులను అతి కిరాతకంగా చంపి, డెడ్ బాడీల ఆనవాళ్లు దొరకకుండా మొసళ్లు ఎక్కువగా ఉండే యూపీలోని కాస్‌గంజ్‌ దగ్గర హజారా కాల్వలో పడేసేవాడు. ఢిల్లీ, రాజస్థాన్, హరియాణలో 7 కేసుల్లో జీవితఖైదు పడింది. దేవేందర్‌ శర్మ, అతని గ్యాంగ్ కార్లను బుక్‌ చేసుకొని డ్రైవర్లను చంపేవారు. తర్వాత వాహనాలను ఎత్తుకెళ్లి తిరిగేవారు.125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్లకు పాల్పడ్డట్లు విచారణలో తేలిందని ఆదిత్య గౌతమ్ వివరించారు. 

Also Read: పాక్ కు చుక్కలు చూపించిన మన S- 400, ట్రంప్ గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటో తెలుసా?

doctor | murder | crocodile | telugu-news | today telugu news

Advertisment
తాజా కథనాలు