Murder case: పుస్తెల తాడు కోసమే మేకల కాపరి హత్య.. అనకాపల్లి వివాహిత మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు!

ఏపీ లక్కవరం వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేకల మేతకు వెళ్లిన నరసమ్మ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కోసమే ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. ఛత్తీష్‌గఢ్ బార్డర్‌లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.

New Update
anakapally

anakapally Photograph: (anakapally)

Murder case: ఏపీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడు వారాల క్రితం చోడవరం మండలంలో జరిగిన ఒక మహిళ హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చోడవరం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 9వ తేదీన చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఒబ్బల రెడ్డి నరసింహమూర్తి భార్య నరసమ్మ అదే గ్రామానికి చెందిన గోపాలయ్య పొలంలోకి మేకలు మేతకై కత్తి పట్టుకుని వెళ్లింది. అయితే చీకటి పడిన భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఆమె వెళ్లిన ప్రాంతానికి వెళ్లి వెతకగా ఆమె స్పృహ కోల్పోయి బండారు లక్ష్మమ్మ పొలంలో కనిపించింది.

మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు..

ఆ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. ఆమె శరీరంపై రక్తస్రావం గుర్తించిన భర్త భార్య మృతి చెందినట్లు నిర్ధారించుకుని ఆ రాత్రి 9 గంటలకు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాలను విచారించి సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించి, అనేకమంది సాక్ష్యాన్ని విచారించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. సిసిటిఎన్ఎస్ ఉపయోగించి నిందితుడి గత నేరాలను ధృవీకరించి, కాల్ డేటా రికార్డులను సేకరించి.. మెసేజ్, కాల్ లాక్స్, బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా కీలక సమాచారం సేకరించమన్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు..

ఇక నిందితుడు హత్య చేసిన తర్వాత బంగారం వస్తువులను విజయనగరం జిల్లా కొత్తవలస ముత్తూట్ ఫైనాన్స్ లో 1లక్ష 85 వేల రూపాయలకు తాకట్టు పెట్టినట్టు గుర్తించమని పోలీసులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించి, ఏటీఎం రిసీట్లు, అండర్ ట్రాన్స్ఫర్లు ట్రాక్ చేసి, నిందితుడే ఆర్థిక లావా దేవిలను అనుసరించడం జరిగిందన్నారు. అలాగే నిందితుడి కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛతీస్ గడ్ రాష్ట్రంలో అతడి కదలికలు గుర్తించమన్నారు. సిడిఆర్ డేటాలో ఉన్న బి పార్ట్ నెంబర్లను ఉపయోగించి ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల వివరాలు సేకరించమన్నారు. జిల్లా జైలు అధికారుల నుంచి అతడిపై ఉన్న పాత కేసులు గురించి ఆరాతీయగా నిందితుడి అత్యంత సన్నిహితుల సమాచారం తెలిసిందన్నారు. 

ఇది కూడా చదవండి: Anti-Conversion Bill: మతమార్పిడిలకు చెక్.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సంచలన బిల్లు

చోడవరం మండలం గజపతినగరం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధం, మృతురాలు బంగారాభరణాలు, నిందితుడు హత్య సమయంలో ధరించిన దుస్తులు, కేసుకు సంబంధించిన ముఖ్య ఆధారాలు స్వాధీన పరుచుకుని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసున ఛేదించిన చోడవరం పోలీసులను ఎస్పీ అభినందించారు. వారు తీసుకున్న నిఘా పద్ధతులు, సాంకేతిక ఆధారాలతో నిందితుని అరెస్ట్ చేయడం ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి వీలు కలిగిందన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు