/rtv/media/media_files/2025/02/03/3NB6R8pGtzKvKBqMlMP3.jpg)
rajasthan govt religion bill
Anti-Conversion Bill: రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో(Rajasthan Assembly) మతమార్పిడులపై సంచలన బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మతం మార్చుకోవాలంటే రెండు నెలల ముందు కలెక్టర్ కు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇందులో ఎవరి బలవంతం లేదంటేనే అనుమతి లభిస్తుంది. ఎవరినైనా బలవంతంగా మతమార్పిడి చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50, వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
మైనర్, మహిళలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులను బలవంతంగా మత మార్పిడిలకు ప్రొత్సహిస్తే వారికి రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటుగా రూ. 25,000 జరిమానా ఉంటుంది. ఒక్కోసారి 10 సంవత్సరాల వరకు శిక పొడిగించబడుతుంది. సామూహిక మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష , రూ. 50 వేల జరిమానా విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది.
ఈ బిల్లు లక్ష్యం దేశంలో లౌకికవాద స్ఫూర్తిని కొనసాగించడమని రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. మతమారడానికి సంబంధించిన డిక్లరేషన్‌లో మతం మారిన వ్యక్తి పుట్టిన తేదీ, శాశ్వత/ప్రస్తుత చిరునామా, తండ్రి/భర్త పేరు, మత మార్పిడికి ముందు, తర్వాత మతం, మారిన తేదీ, స్థలం మొదలైనవి ఉంటాయి. మతం మారిన వ్యక్తి 21 రోజులలోపు జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
రాజస్థాన్ తో పాటుగా
గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో రాజస్థాన్ న్యాయ మంత్రి జోగరామ్ పటేల్ మాట్లాడుతూ.. బలవంతపు మతమార్పిడులను కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా గిరిజనుల వంటి బలహీన వర్గాల వారు లవ్ జిహాద్ కు బలి కాకుండా ఉండేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా రాజస్థాన్ తో పాటుగా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక , జార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
Also Read : ఛార్మిని అలా చూపించి తప్పు చేశా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!