AI Fake Videos Viral: AIతో అమ్మాయిల బూతు వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో AI తో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టాండ్ అప్ కామెడీ షో లో నిజంగానే అమ్మాయిలు బూతు మాట్లాడుతున్న వీడియోలో ఉన్నాయి. వీటిని చూసి కొందరు రియల్ వీడియోలని, ఇలా అమ్మాయిలు బరి తెగించారు ఏంటని మండిపడుతున్నారు.

author-image
By Kusuma
New Update
AI Videos

ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి రియల్, ఫేక్ అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అమ్మాయిల బూతు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐతో చేసిన వీడియోలో అమ్మాయిలు స్టాండ్-అప్ కామెడీ షోలో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తారు. ఇందులో అన్ని కూడా డబుల్ మీనింగ్, బూతు వీడియోలు ఉంటాయి.

A post shared by Aravind Journo (@aravind__info)

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

రియల్ వీడియోస్ లాగానే..

సోషల్ మీడియాలో ఇవి వైరల్ కావడంతో జనాలు ఇవి నిజమైన వీడియోలు అని అనుకున్నారు. కానీ ఇవి ఏఐతో చేసిన వీడియోలు. చూడటానికి అచ్చం ఏఐ వీడియోలాగానే కనిపిస్తాయి. దీంతో ఎక్కువ మంది నిజమైన అమ్మాయిలు ఇలా మాట్లాడుతున్నారని అమ్మాయిలను నెటిజన్లు తిట్టేవారు. ఎంత కాలం మారితే మరి ఇంతలా బరితెగించాలా అని అమ్మాయిలపై మండిపడ్డారు. చివరకు ఇవి ఏఐ వీడియోలు అని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

ఏఐని ప్రయోజనాల కోసం కాకుండా కొందరు ఇలా బూతు వీడియోలు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ మారడంతో ఏఐని ఉపయోగించి తప్పుడు ముఖాలు, గొంతులు సృష్టించి వీడియోలు చేస్తున్నారు. అయితే ఇందులో యువతులను క్రియేట్ చేసి పెట్టడంతో వీరిపై నెగిటివిటీ ఎక్కువగా వస్తోంది. చూడటానికి రియల్ వీడియోలాగా ఉండటంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తు్న్నారు. ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు AI దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఇలాంటి ఫేక్ వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

Advertisment
తాజా కథనాలు