/rtv/media/media_files/2025/01/27/SVbun2RincdMaBPwoC7H.jpg)
dhile sutecase Photograph: (dhile sutecase)
సహజీవనంలో ఉన్న యువతిని దారుణంగా కొట్టి చంపాడు ఓ యువకుడు. ఏడాదిపాటు తన దగ్గరి బంధవుతో మహిళ సహజీవనం చేసింది. కుటుంబాన్ని వదిలేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే శిల్పా పాండే(22)ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతను నిరాకరించాడు. అయినా ఆమె ఒత్తిడి చేయడంతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి, డీజిల్ పోసి నిప్పటించాడు. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ఏరియాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
#WATCH | Delhi | DCP East Abhishek Dhania says, "...We received a PCR call yesterday and learnt that a body was lying at a particular place in Ghazipur police jurisdiction, which was completely burnt... After investigation by the crime and FSL team, it was found that it was a… pic.twitter.com/Eos5Nuo4HD
— ANI (@ANI) January 27, 2025
ఘాజీపూర్ ఏరియాలో ఆదివారం ఉదయం కాలిన సూట్‌కేసులో మహిళ మృతదేహం కనిపించింది. దాంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సూట్‌కేస్ అక్కడ పడే కొన్ని గంటల ముందు ఓ కారు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారు ఓనర్‌ను సంప్రదించగా దాన్ని అమిత్ తివారీ అనే వ్యక్తికి కొన్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
అమిత్ తివారీని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పడేయడం కోసం స్నేహితుడు అనూజ్ సాయం తీసుకున్నాని చెప్పాడు. దాంతో పోలీసులు అనూజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శిల్పా పాండే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. శిల్పా పాండే తల్లిదండ్రులు గుజరాత్‌లోని సూరత్ వాసులుగా పోలీసులు విచారణలో తేలింది.
Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే