/rtv/media/media_files/2025/04/11/xE0bBPckldzdQk3N9DUJ.jpg)
teacher-satyasai
హోం వర్క్ చేయలేదని విద్యార్థులను ఓ టీచర్ చెప్పుతో కొట్టింది ఈ అమానుష ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జీనియస్ ప్రైవేటు పాఠశాలలో గొట్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సనద్వైజ్, జశ్విన్, భరత్ రెండో తరగతి చదువుతున్నారు. అయితే ఇదే పాఠశాలలో రెండు రోజుల క్రితం టీచర్‌గా చేరిన అనిత వారిపై దురుసుగా ప్రవర్తించింది. ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహంతో దుర్భాషలాడింది. అంతటితో ఆగకుండా విచక్షణ కోల్పోయి తన చెప్పు తీసుకుని ముగ్గురు విద్యార్థులనూ కొట్టింది.
విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్
— Rahul (@2024YCP) April 11, 2025
అదేమని అడిగిన తల్లిదండ్రులకూ చెప్పు చూపించిన వైనం
శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన pic.twitter.com/5o3DeIRsvR
Also read : తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
Also Read : Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!
అనుకోకుండా అలా జరిగిందని
అయితే అ విషయాన్ని ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వెల్లడడించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి టీచర్ అనితను నిలదీశారు. టీచర్ గా మీరు ఇలా చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. అయితే అది అనుకోకుండా అలా జరిగిందని, కావాలని కొట్టలేదని టీచర్ అనిత వారికి బదులిచ్చింది. ఆమె చెప్పిన సమాధానానికి విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించకపోవడంతో వారిపైనా కూడా అనిత చెప్పు ఎత్తింది. దీంతో అనితను అక్కడే వారు చితకబాదారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రేమ్ కిశోర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అనంతరం తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పాఠశాల యాజమాన్యం, అనితపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!
Also read : ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!