/rtv/media/media_files/2025/08/15/woman-gang-raped-after-drink-in-delhi-2025-08-15-19-18-42.jpg)
Minor girl gang raped in Khammam
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై (13) గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక ఇంటికి శుక్రవారం ఓ బాలుడు వచ్చాడు. నీ తమ్ముడు కింద పడిపోయాడు అంటూ మాయమాటలు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలిక అతడితో వెళ్లింది.
Also Read: రైలులో మంటలు.. కిందికి దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
ఆ తర్వాత అతడితో పాటు మరో మరో బాలుడు, ఓ యువకుడు కలిసి ఆ బాలికపై అత్యాచారం చేశారు. అయితే బాలిక తల్లిదండ్రులు పనిమీద హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంట్లో ఉండే ఆమె తాతయ్య, నానమ్మ కూడా బయటకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసిన ఆ దుర్మార్గులు ఈ దారుణానికి ఒడిగట్టారు. చివరికి ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఫిర్యాదు చేసింది. నిందుతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
Also Read: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. సర్వేలో సంచలనం
ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఓ GHMC పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ బాధితురాలు ఎప్పటిలాగే తన విధులను నిర్వహించేందుకు ఎర్రగడ్డకు వెళ్లింది. తనకు కేటాయించిన స్థలంలో విధులు నిర్వహిస్తుండగా రాజు వ్యక్తి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు .
Follow Us