Train Fire Accident: రైలులో మంటలు.. కిందికి దిగి పరుగులు తీసిన ప్రయాణికులు

ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో అల్వార్‌లోని తిజారా గేట్ సమీపంలో రైలులోని G7, G8, G15 కోచ్‌ల సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

New Update
Train Fire Accident

Train Fire Accident

ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో అల్వార్‌లోని తిజారా గేట్ సమీపంలో రైలులోని G7, G8, G15 కోచ్‌ల సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కోచ్ నుండి పొగలు రావడం చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 

Train Fire Accident

ఒకవైపు పొగలు, మరోవైపు ట్రైన్ స్పీడ్.. దీంతో క్షణ క్షణం భయం భయంతో గడిపారు. అనంతరం ప్రయాణికులు రైలు గొలుసును లాగడంతో ట్రైన్ ఒక్కసారిగా స్లో అయింది. వెంటనే ప్రయాణికులు భయంతో కిందకు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైలు సిబ్బంది, ఎలక్ట్రీషియన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

రైలులో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వ్యవస్థ ద్వారా మంటలను వెంటనే నియంత్రించారు. సిబ్బంది దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి కోచ్ బ్రేక్‌లను సరిచేశారు. ఈ సమయంలో రైలు తిజారా గేటు వద్ద దాదాపు గంటసేపు అలాగే నిలిచిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం ప్రయాణీకులు తిరిగి ట్రైన్‌లోకి ఎక్కారు. ఆ తర్వాత రైలు సురక్షితంగా బయలుదేరింది. అయితే రైలు కోచ్ బ్రేక్‌లు స్ట్రక్ అయిపోయాయని.. అందువల్లనే కోచ్ కింద మంటలు చెలరేగాయని దర్యాప్తులో తేలింది. 

ఢిల్లీకి చెందిన మహేంద్ర అనే ప్రయాణీకుడు మాట్లాడుతూ.. ‘‘రైలు అల్వార్ స్టేషన్ ముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. ప్రయాణీకులు దిగి, కోచ్ కింద నుండి తెల్లటి పొగ ఎగసిపడటం చూశారు. ఎవరికీ గాయాలు కాలేదు.’’

స్టేషన్ మాస్టర్

ఖైర్తల్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత అల్వార్ ముందు ప్రయాణికులు రైలు గొలుసును లాగారని స్టేషన్ మాస్టర్ రాజేష్ మీనా తెలిపారు. అల్వార్ నగరానికి సమీపంలో ఉన్న రైల్వే క్యాబిన్ దగ్గర రైలు ఆగిపోయిందని.. తరువాత మంటలను అదుపులోకి తెచ్చారని అన్నారు.

అనంతరం GRP స్టేషన్‌కు చెందిన ASI సత్యేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రైలులోని G7, G8, G15 కోచ్‌ల సమీపంలో మంటలు చెలరేగాయని అన్నారు. ఆ తర్వాత ప్రయాణికులు దిగిపోయారని.. అల్వార్ జంక్షన్‌లో దిగాల్సిన వారు భయపడి వెళ్లిపోయారు అని  తెలిపారు.

Advertisment
తాజా కథనాలు