/rtv/media/media_files/2025/04/29/3J0JEp4vwrcSlakgZOsf.jpg)
up-women
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది, 50 ఏళ్ల ఇంద్రావతి అనే ఓ మహిళ తనకు వరుసగా మనవడు అయ్యే 30 ఏళ్ల ఆజాద్‌తో లేచిపోయి ఓ ఆలయంలో వివాహం చేసుకుంది. ఇంద్రావతి నలుగురు పిల్లల తల్లి.. ఆమె ఒక కుమార్తె వివాహం అయినప్పటికీ, ఆమె తన భర్త చంద్రశేఖర్, పిల్లల్ని వదిలి ఆజాద్‌తో పారిపోవాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటన తాండా తహసీల్‌లోని బస్ఖారి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రతాప్‌పూర్ బెల్వారియా గ్రామంలో చోటుచేసుకోగా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్
ఆజాద్ తో ప్రేమ వ్యవహారం
ఇంద్రావతి చాలా కాలంగా ఆజాద్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఆజాద్ ఇంద్రావతికి మనవడు అవుతాడు. ఆజాద్ క్రమంగా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే, ఇద్దరూ సమాజం గురించి పట్టించుకోకుండా కలిసి జీవించి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ వారిద్దరినీ అభ్యంతరకరమైన స్థితిలో చూశానని చెబుతున్నాడు. అయినప్పటికీ, ఇంద్రావతి, ఆజాద్ తమ సంబంధాన్ని వదులుకోలేదు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
ఇంద్రావతి, ఆజాద్ కలిసి తనను, పిల్లలను చంపడానికి భోజనంలో విషం కలిపి కుట్ర పన్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సంఘటనతో బాధపడిన చంద్రశేఖర్, తన భార్య చనిపోయినట్లు భావించి, గ్రామంలో ఆమె పదమూడవ రోజు కర్మలు కూడా చేశాడు. కాగా ఇంద్రావతితో చంద్రశేఖర్ కు రెండవ వివాహం. గ్రామంలో వ్యవసాయం, మేకల పెంపకం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు చంద్రశేఖర్. సంబంధాలకు అవమానం కలిగించే ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన