/rtv/media/media_files/2025/09/02/uk-accident-2025-09-02-10-39-42.jpg)
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులను నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆసుపత్రిలో చికత్స అందిస్తున్నారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను హైరదాబాద్ కు తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు.
Also Read : IndiGo : ఇండిగో విమానానికి తప్పిన ఘోర ప్రమాదం.. స్పాట్ లో 272 మంది ప్రయాణికులు!
A student from Hyderabad lost his life in a horrific road accident in the United Kingdom (UK) in the early hours of Monday, September 1.https://t.co/w9S6vdJLQY
— The Siasat Daily (@TheSiasatDaily) September 2, 2025
మరోవైపు నిమజ్జనానికి వినాయక విగ్ర హాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ ను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 8మందికి తీవ్ర గాయా లయ్యాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇటిక్యాలలోని చెన్నకేశవ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జన కోసం ట్రాక్టర్ లో బీచుపల్లి వద్ద గల కృష్ణానదికి తరలించారు. అయితే ట్రాక్టర్ నేషనల్ హైవేపై కొట్టం ఇంజనీ రింగ్ కాలేజీ సమీపానికి రాగానే వెనక నుంచి ఓ డీసీఎం వాహనం ఢీకొంది. ట్రాక్టర్ బోల్తాపడడంతో.. జమ్మన్న(50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన నర్సింహులు(48) ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. మరో ఎనిమిది మందికి గాయాలవ్వగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Also Read : ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు
ఆటోతో సహా చెరువులో మునిగి
ఇక నిమజ్జనానికి వెళ్లిన తండ్రి, కుమారుడు ఆటోతో సహా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దుండిగల్ కు చెందిన శ్రీని వాస్(35) ఆదివారం సాయంత్రం తన ఆటో ట్రాలీలో వినాయక విగ్రహాన్ని మోతీచెరువులో నిమజ్జనానికి తరలించారు. ఆయన తన కుమారుడు జాన్వెస్లీ(7)ని వెంట తీసుకెళ్లారు. నిమజ్జన తర్వాత... చెరువుకట్టపై రివర్స్ తీసుకునే క్రమంలో ఆటోట్రాలీ చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో.. శ్రీనివాస్, జాన్ వెస్లీ నీట మునిగారు. చీకటవ్వడంతో ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. సోమవారం ఉదయానికి కూడా తండ్రీకొడుకులు ఇంటికి రాకపో వడంతో.. కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలించి, ఆటోను గుర్తించారు. అందులోనే శ్రీనివాస్, జాక్వెస్లీ మృతదేహాలు లభ్యమయ్యాయి.
Also read : MLA Harmeet Singh : పంజాబ్ లో కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే