BIG BREAKING: ముంబైలో 34 మానవ బాంబులు.. 14 మంది టెర్రరిస్టులు.. షాకింగ్ న్యూస్!

ముంబైలో మానవ బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన 14 మంది టెర్రరిస్టులు ముంబైలోకి వచ్చారంటూ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నగరంలో పలు ప్రాంతాల్లో 34 మానవ బాంబు దాడులు జరుగుతాయని వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ముంబైలో మానవ బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన 14 మంది టెర్రరిస్టులు ముంబైలోకి వచ్చారంటూ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నగరంలో పలు ప్రాంతాల్లో 34 మానవ బాంబు దాడులు జరుగుతాయని వార్నింగ్‌ ఇచ్చారు. పేలుళ్ల కోసం 400 కిలోల RDX తరలించినట్లు మెయిల్‌ ద్వారా తెలిపారు. అయితే ఉగ్రవాదులు పాక్‌లోని లష్కర్‌ ఏ జిహాదీకి చెందిన వారని తెలుస్తోంది. వారు చేపడుతున్న భారీ పేలుళ్లతో మొత్తం ముంబై నగరం నాశనం అవుతుందని మెయిల్‌లో తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్‌తో సిటీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ఇది కూడా చూడండి: Crime: కరీంనగర్ మెడికల్ కాలేజీలో కలకలం.. బుర్కాతో మహిళల బాత్రూంలోకి దూరి..!

నగరంలో భద్రతా బలగాలను భారీగా మోహరించిన పోలీసులు..

నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో గణేష్ నిమజ్జనాలు జరగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతా బలగాలను కూడా అధికంగా మోహరించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌లను అధికారులు ఉంచారు. అనుమానం వచ్చిన ప్రతీ దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రజలకు నగరంలో ఎక్కడైనా అనుమానస్పదంగా కదలికలు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: AP IAS: ఏపీలో ఓ ఐఏఎస్ బాగోతం.. సైలెంట్ గా మహిళను లేపేసి.. ఎంతకు తెగించాడంటే?

ఇటీవల బిహార్‌ సివిల్ కోర్టుకు బెదిరింపులు..

ఇదిలా ఉండగా ఇటీవల పట్నాలోని సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపుల మెయిల్ వచ్చింది. జైషే మహ్మద్‌కి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు బిహార్‌లోకి ప్రవేశించారు. దీంతో వెంటనే బిహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను కూడా విడుదల చేశారు. దీంతో రాష్ట్రమంతా అధికారులు హైఅలర్ట్  ప్రకటించారు. అయితే ఈ ఉగ్రవాదులు నేపాల్‌ మీదుగా బిహార్‌ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు