/rtv/media/media_files/2025/01/23/klhGMEBhDbN7aiXPjYjF.jpg)
Cops As Security For Dalit Groom wedding
Rajasthan: స్వాతంత్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తోన్న దళితుల జీవితాల్లో మార్పురావడంలేదు. దళితులు చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా, ఉన్నతంగా జీవించినా అగ్రకులాలు సహించడం లేదు. చివరికి దళితులు కాస్తా ఉన్నతంగా పెండ్లి చేసుకున్నా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత యువతి అరుణతో పెండ్లి నిశ్చయమైంది. అయితే విజయ్ రేగర్ వధువు గ్రామమైన లావెరా గ్రామంలో గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడు.
పోలీస్ బందోబస్తుతో దళిత వరుడి పెండ్లి ఊరేగింపు
అరుణకు పెండ్లి నిశ్చయమైందని గ్రామంలో తెలియగానే అగ్రవర్ణాల వారు ఆమె తండ్రి నారాయణ్‌ను పిలిచి హెచ్చరించారు. పెండ్లి పేరుతో గ్రామంలో ఎలాంటి ఊరేగింపులు, బరాత్‌లు నిర్వహించరాదని సూచించారు. దీంతో ఆయన మానవ్ వికాస్ అవమ్ అధికార్ కేంద్ర సంస్థాన్ కార్యదర్శి రమేష్ చంద్ బన్సాల్‌ను కలిశారు. ఆయన స్థానిక కార్యకర్తలను అరుణ తండ్రి నారాయణ్ కు సహాయంగా పంపాడు. వారి సహాయంతో నారాయణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశాడు. అలాగే తన కూతురి పెండ్లిలో వరుడి ఊరేగింపు, బరాత్‌కు రక్షణ కల్పించాలని పోలీస్ అధికారులను కలిశాడు.
Also Read: తెలంగాణకు అమెజాన్ బంపరాఫర్.. వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం
నారాయణ్ ఆందోళనపై మానవహక్కుల కమిషన్‌తో పాటు అజ్మీర్ ఎస్పీ స్పందించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మరోవైపు దళిత వరుడు గుర్రంపై ఊరేగే విషయమై ముందుగా గ్రామస్తులతో చర్చించారు. ముఖ్యంగా అగ్రవర్ణాల వారితో మాట్లాడారు. వారు సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని హామీ ఇచ్చారు. అయినప్పటకీ ఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా లోని పలు పోలీస్ స్టేషన్ల కు చెందిన సుమారు 200 మంది పోలీసులను లావెరా గ్రామంలో మోహరించారు.
National Shame for India.
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) January 23, 2025
Wedding procession of a Dalit boy was carried out under heavy police protection in RJ's Ajmer dist due to the fear of attack by dominant caste goons. Terrible!
The police force was more than the relatives of the couple's family. This is the India where… pic.twitter.com/J7ipaVZutT
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
మొత్తం మీదా ఈ నెల 21న విజయ్, అరుణల పెళ్లికి అన్ని ఏర్పాట్ల చేశారు. ముందుగా ఆదేశించినట్లే సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు విజయ్ గుర్రంపై ఊరేగాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మేళతాళాలు, డ్యాన్సుల మధ్య ధూంధాం మధ్య బరాత్ తీశారు. అదే సమయంలో గ్రామంలోని అగ్రవర్ణాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు డీజే, పటాకులు కాల్చడం వంటి హంగామాకు వధువు కుటుంబం దూరంగా ఉన్నది. అయితే పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు విజయ్ గుర్రంపై ఊరేగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ