Corona Virus: అలెర్ట్‌.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో కూడా జూన్‌ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.

New Update
Corona Virus: అలెర్ట్‌.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

కరోనా వైరస్‌ మళ్లీ జడలు విప్పుతోంది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. అలాగే దక్షిణ కొరియాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతివారం 17, 358 కేసులు వస్తున్నాయి. భారత్‌లో కూడా జూన్‌ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది. ఇద్దరు మృతి చెందారు.

Also read: కరోనా వల్ల బ్రెయిన్‌ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు

ప్రస్తుతం విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్‌ వల్ల దాదాపు 26 శాతం డెత్‌ రేట్‌ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే పాత వైరస్‌ కంటే 11 శాతం ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇప్పుడు విస్తరిస్తున్న కరోనా కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ కుటుంబానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక భారత్‌లోని అస్సాం, ఢిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Also Read: చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉంది: పూనమ్ కౌర్

Advertisment
Advertisment
తాజా కథనాలు