Covid-19: కరోనా వల్ల బ్రెయిన్ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్ జరుగుతున్నాయని.. ఇవి వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. By B Aravind 31 Aug 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి నాలుగేళ్ల క్రితం బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి ఇంకా మనతోనే ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ ఎప్పటిలాగే సాధారణ జీవితంలోకి పూర్తిగా వచ్చేశారు. అయితే ఈ వైరస్‌కి సంబంధించి ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కరోనా వైరస్ వల్ల బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌కు కూడా దారి తీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్ జరుగుతున్నాయని.. ఇవి బ్యాక్ డోర్ ద్వారా వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. నేచర్ మైక్రోబయాలజీ అనే జర్నల్‌లో స్పైక్ ప్రోటీన్‌పై పలు కీలకమైన విషయాలను ఈ సర్వే వెల్లడించింది. వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్‌ప్రోటిన్‌లో 'ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్' అనే భాగంపై పరిశోధకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సైట్.. సాధారణంగా ఫ్రంట్ డోర్ ద్వారా వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి ప్రవేశించేలా చేస్తుంది. అలాగే ఈ ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్ మ్యూటేట్ అయినప్పుడు కూడా ఈ వైరస్‌ను బలవంతంగా బ్యాక్‌డోర్ ద్వారా బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తుంది. అందుకే కొంతమంది కరోనా బాధితుల్లో.. బ్రెయిన్ ఫాగ్, కళ్లు తిరిగడం, జ్ఞాపకశక్తి సమస్యలు బయటపడినట్లు పరిశోధకులు వెల్లడించారు. Also Read: ఆ సైట్స్‌లో 96శాతం ముఖాలు ఒరిజినల్.. బాడీలు మాత్రం ఎవరివో.. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీపై సంచలన నివేదిక! మానవ ACE2 గ్రాహకాలను ఉత్పత్తి చేయగల జన్యుపరంగా మార్పు చేయబడిన ఎలుకలపై పరిశోధన చేపట్టారు. ఈ ఎలుకలు కరోనా వైరస్‌కు గురైనప్పుడు.. వాటి ఊపిరితిత్తులు, మెదడు కణజాలల నుంచి వైరల్ జన్యువులను విశ్లేషించారు. ఫ్యూరీన్ క్లీవేజ్ సైట్ మ్యూటేషన్ అయిన వైరస్ బ్రెయిన్ సెల్స్‌కు ఇన్‌ఫెక్ట్ అవుతుందని తేలింది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, కదలికకు సంబంధించి భాగాల్లో ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. అయితే ఎలుకలకు జరిగినట్లుగానే మనుషులకు కూడా ఇలాగే జరుగుతుందా అనేది నిర్ధారించేందుకు మరింత పరిశోధన చేయాల్సి ఉంది. మ్యూటేషన్లు వైరస్‌ను బ్రెయిన్‌లోకి ఎందుకు పంపిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఓ పరిశోధకుడు తెలిపారు. కరోనాతో వచ్చే ఇలాంటి నాడి సంబంధిత ప్రభావాలను అరికట్టేందుకు.. దీనికి చికిత్స చేసేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల బ్రెయిన్‌కు వచ్చే సమస్యలను నియంత్రించేందుకు ఈ సర్వే ఓ మార్గాన్ని చూపించింది. బ్రెయిన్ కణాల్లోకి ప్రవేశించేందుకు వైరస్‌లు ఎన్నుకునే మార్గాన్ని గుర్తించి.. దాన్ని బ్లాక్ చేసేలా ఔషధాలను అభివృద్ధి చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక నరాల సంబంధిత సమస్యలను నియంత్రించేందుకు ఇలాంటి చికిత్సలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే ఇందుకోసం మరింత పరిశోధనలు చేయాల్సి ఉంది. Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు…తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే! #telugu-news #national-news #covid-19 #brain-infection మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి