Harish Rao: రైతు బంధును కాంగ్రెస్ ఆపింది.. హరీష్ రావు ఫైర్! రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ ఆపించారని మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పిందని అన్నారు. జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 04 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA Harish Rao: పటాన్చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS)కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. పటాన్చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉందని అన్నారు హరీష్. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడని పేర్కొన్నారు. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు. కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. మనకు 39 సీట్లు వచ్చాయని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైందని పేర్కొన్నారు. ALSO READ: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్ మేమేం తొందరపడడం లేదు.. కేసీఆర్ (KCR) అంబేద్కర్ విగ్రహం నిర్మించారని... ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మించారని పేర్కొన్నారు హరీష్. విపక్షాలు దుష్ప్రచారం చేశాయని అన్నారు. కాంగ్రెస్ (Congress Party) ఇప్పుడు వాటినే వాడుకుంటోందని అన్నారు. ప్రగతి భవన్లో 150 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అప్పట్లో ఆరోపించారని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నాడని చురకలు అంటించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని.. మేమేం తొందరపడడం లేదని.. మీరు చెప్పిన తేదీల్లో అమలు కాలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నాం అని అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ ఆపించింది.. రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ ఆపించారని మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పిందని అన్నారు. 'వడ్లకు బోనస్ ఇవ్వలేదు. వృద్ధులకు 4 వేల పింఛన్ ఇస్తామని ఇవ్వలేదు. జనవరిలో 2 వేల పింఛన్ కూడా ఇవ్వలేదు. ఒక నెల పింఛన్ ఎగ్గొట్టారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది. ఇళ్లకు ఉచిత కరెంట్, 15వేల రైతు బంధు, డిసెంబర్ 9న రుణమాఫీ.. ఇలాంటి జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.' అని హరీష్ వ్యాఖ్యానించారు. 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు హరీష్. ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లను రోడ్డున పడేశారని ఫైర్ అయ్యారు. పింఛన్ ఎగవేత, రైతుబంధు ఇవ్వకపోడం, మాట ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కరెంటు కోతలు, కాలిపోతున్న మోటార్లు... కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే అని మండిపడ్డారు. పదేళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా మేం మన ప్రాజెక్టులకు కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్డుకు అప్పగించిందని.. ఇప్పుడు నీటికి కొరత రాబోతుందని అన్నారు. ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు DO WATCH: #rythu-bandhu #harish-rao #congress #congress-six-guarantees #kcr #cm-reavanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి