KTR: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్ సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తారు కేటీఆర్. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని అన్నారు. By V.J Reddy 04 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని ఈ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు భరోసాను ఇచ్చారు. ఎన్నికల ఫలితాలతో ఎవరు అధైర్య పడొద్దని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను మడత పెట్టీ కొట్టుడే... ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని చురకలు అంటించారు. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ను బొంద పెట్టుడే... 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నరని పేర్కొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతాం అని అన్నారు. మొన్నటి ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్న అని అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ALSO READ: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. సీపీ సీరియస్ DO WATCH: #cm-revanth-reddy #ktr #brs-party #malkajgiri #congress-six-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి