Mallikarjun Kharge: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు... ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ చేసిందేమి లేదని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ విమర్శించారు. By B Aravind 14 Apr 2024 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి Mallikarjun Kharge Counter on BJP Manifesto: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం బీజేపీ.. తమ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ (PM Modi) చేసిందేమి లేదని అన్నారు. గత ఎన్నికల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించి.. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి ధర్నా చేశారని పేర్కొన్నారు. Also Read: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు యవతీయువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మాత్రం ఈ సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లపాటు పాలించిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ అని ప్రధాని మోదీ అన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుందని చెప్పారు. మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యమని.. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. Also Read: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర #telugu-news #congress #national-news #mallikarjun-kharge #bjp-manifesto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి