Ex MLA Balineni Srinivasa Reddy : తెలంగాణలో జరిగిన ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy). తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని అన్నారు. టీడీపీ వాళ్లు ఎంత రోడ్ల మీదకు వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందని అన్నారు.
ALSO READ: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తులు పెట్టుకుంటాయని అన్నారు. వైసీపీ సీఎం జగన్ నాయకత్వంలో సింగిల్‌గా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. ఐదేళ్లుగా ప్రజలు సంక్షేమాన్ని గుర్తించారని అన్నారు. టీడీపీ, జనసేన.. అసలు ఆ రెండు పార్టీలకు నైతికత ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన జగన్ సీఎం అయ్యేదాన్ని ఎవరు ఆపలేరని అన్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం గుండ్లకమ్మ గేట్ల నిర్వహణ చేపట్టలేదని ఫైర్ అయ్యారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ALSO READ: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్