ఇద్దరికీ బుద్ధి లేదు ఆస్తి కోసం
AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు.
AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన బాలినేనిని పార్టీలోకి స్వాగతించబోమని తేల్చి చెప్పారు.
AP: ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.
AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొన్ని ఛానెల్స్ తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది.అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి అక్రమాలపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా సాక్ష్యాలతో వివరణ ఇచ్చారు. వెంచర్ కోసం నకిలీ అనుమతి తీసుకుని వే బిల్ ద్వారా కొండను తవ్వించారన్నారు. నల్ల కాలువను సైతం ఆక్రమించారన్నారని మండిపడ్డారు.