తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్‌ నేతలు..

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్‌ నేతలు..

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, మల్లు రవి, సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని మాతో చేతులు కలపాలని వారు కోరారు. సుమారు గంటపాటు సమావేశం జరగ్గా తుమ్మల నాగేశ్వర్‌ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై సిద్ధంగా ఉంటే తుమ్మలతో పాలేరు టికెట్‌పై కూడా చర్చిస్తామని వారు హామి ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు తుమ్మల నాగేశ్వర్‌ రావును గతంలోనే బీజేపీలో చేరాలని ఎమెల్యే ఈటల రాజేందర్‌ కోరారు. ఆయన ఆ పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్‌పై చర్చిస్తామని సూచించారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి తమకు అవసరమని తుమ్మల బీజేపీ వైపుమొగ్గు చూపుతే తాము రెడ్‌ కార్పెట్‌ పరుస్తామని ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కాగా ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితాలో తుమ్మల నాగేశ్వర్‌ రావు పేరు లేకపోవడంతో అసంతృప్తికి గురైన తమ్మల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన.. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించానని, కానీ సహచరులు, అభిమానులు పోటీలో ఉండాలని కోరారన్నారు.

క్యాడర్‌ అభ్యర్దన మేరకు తాను పోటీలో ఉండబోతున్నట్లు తెలిపారు. కాగా తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ప్రకటించలేదు. అయితే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కాంగ్రెస్‌ జెండాలు కన్పించడంతో తుమ్మల కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అప్పడే భావించారు. తుమ్మల నాగేశ్వర్‌ రావు అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం తుమ్ముల నాగేశ్వర్‌ రావు కాంగ్రెస్‌లోకి ఎప్పుడు వెళ్లుతారు అనేదానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు