మహిళా బిల్లు ఓ ఎన్నికల స్టంట్-రాహుల్ గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

New Update
మహిళా బిల్లు ఓ ఎన్నికల స్టంట్-రాహుల్ గాంధీ

మహిళా రిజర్వేషన్ల అంశం మంచిందే అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కానీ... ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే ముందు జన గణన చేపట్టాలి. రెండోది డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. ఈ రెండు పూర్తి చేయాలంటే.. చాలా ఏళ్ళు పడుతుంది. కాబట్టి రిజర్వేషన్ బిల్లుకు ఈ రెండింటితో ముడి పెట్టడం సరైనది కాదని ఆయన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. మహిళకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలంటే ఈరోజే ఇవ్వొచ్చు. లోక్ సభ, రాజ్యసభల్లో 33 శాతం మహిళలకు సీట్లు ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు. అయితే ప్రభుత్వం దీనిని వెంటనే చేయాలనుకోవడం లేదు. ఈ రిజర్వేషన్ల సమస్యను ప్రభత్వం దేశం ముందుపెట్టేసింది. ఇప్పటి నుంచి 10 ఏళ్ళలో అమలు చేస్తామంటోంది. అప్పుడు కూడా అది సాధ్యమవుతుందో లేదో కచ్చితంగా చెప్పడం లేదు. ఇది కేవలం దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రక్రియ అని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఓబీసీల లెక్కలు తీయాలి...కానీ అది చేయడం ఇష్టం లేదు అందుకే ప్రజల దృష్టిని మళ్ళించేందుకు దీనిని తెర మీదకు తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాహుల్ గాంధీ గిమ్మిక్కగా వర్ణించారు.

మూడు రోజుల క్రితం ప్రధాని మోదీ నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. దాని తరువాతి రోజు లోక్ సభలోనూ, నిన్న రాజ్యసభలోనూ మహిళా బిల్లు మీద చర్చలు జరిగాయి. రెండు సభల్లోనూ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మొత్తం 454 మంది ఎంపీలు దీనికి అనుకూలంగా ఓట్లేశారు. కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏకాభిప్రాయంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పార్లమెంటరీ చరిత్రలో సువర్ణాధ్యాయమని ప్రధాని మోదీ అన్నారు. అన్ని పార్టీల నేతలు, సభ్యలుకు ఓటు వేసినందకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు మీద లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ తల్లి, కాంగ్రెస్ నేత సోనియాగాంధీనే మొట్టమొదట ప్రంగించారు. బిల్లుకు సంపూర్ణమద్దతును తెలుపుతున్నామని చెప్పారు. అయితే ఆమె కూడా బిల్లు వెంటనే అమలు అయ్యేలా చూడాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కల నెరవేరిందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు