/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MUMTAZ--jpg.webp)
Nota : గుజరాత్(Gujarat) లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ(BJP) పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలేష్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో మరో కాంగ్రెస్(Congress) అభ్యర్థి వేసిన నామినేషన్ కూడా చెల్లదంటూ ప్రకటించారు. అలాగే సూరత్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన మరో 8 మంది అభ్యర్థలు కూడా చివరికి తమ నామినేషన్లలను ఉపసంహరించుకున్నారు. ఇందులో 7గురు స్వతంత్ర అభ్యర్థులో పాటు ఒక బీఎస్పీ అభ్యర్థి ఉన్నారు. చివరికీ పోటిలో ముకేష్ దలాల్ ఒక్కరే మిగలడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై ఎన్నికల సంఘం అధికార ప్రకటన చేయనుంది.
Also read: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ఆప్షన్‌లో నోటా కూడా ఉంటుందని.. ఆ ఆప్షన్ ఉండగా ఏకగ్రీవం అయినట్లు ఎలా ప్రకటిస్తారంటూ ఎక్స్(X) వేదికగా స్పందించారు. ' ఈవీఎంలలో ఉన్న నోటా ప్రయోజనం ఏంటి ?. మిగిలిన అభ్యర్థులందరూ వైదొలగినప్పటికీ ఓటర్ వేయగల నోట ఆప్షన్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలా ప్రకటిస్తారు. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలి' అని ముంతాజ్ పేర్కొన్నారు.
#EVM में #NOTA किस लिए है? वैसे तो होना नहीं चाहिए … परंतु
गुजरात की #सूरत लोकसभा से #BJP प्रत्याशी को बिना चुनाव कराए ही निर्वाचित घोषित कर दिया गया@ECISVEEP ने किस नियम के तहत यह निर्णय लिया? जल्दबाज़ी किस बात की ?
अगर दूसरे सभी प्रत्याशी चुनाव से हट भी गए, तब भी Nota का… pic.twitter.com/PGOKI0glU5
— Mumtaz Patel (@mumtazpatels) April 23, 2024
Also Read: ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్