Kadiyam Srihari: ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయనక కూతురు కావ్య (Kavya) కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు కాంగ్రెస హైకమాండ్ షాకిచ్చింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదో ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. అయితే తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ ఎన్నికల్లో శ్రీహరినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ (Congress) హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.
Also Read: రేవంత్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?
కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఆ స్థానంలో కూతురు కావ్యకు సీటు ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల దానం నాగేందక్ కూడా ఇదే షరతు పెట్టింది హస్తం పార్టీ. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఇటీవల కె.కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్‌లోకి చేరారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో.. పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also read: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం!