/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CHIP.jpg)
Sharia Law May Forced On Americans - Chip Roy: అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన చిప్ రాయ్ అనే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలో షరియా చట్టాన్ని (Sharia Law) తీసుకువస్తారనే ఆందోళన ఉందని వ్యాఖ్యానించారు. యూకేలోకి పెద్దఎత్తున ముస్లింలు రావడం, ఇజ్రాయెల్‌కి మద్దతు ఇచ్చేవారిని విమర్శించడం.. అలాగే ఇటీవల లీడ్స్‌లో 'మోతిన్ అలీ' కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నుకున్న విషయాలను ఆయన ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని ఎవరు కోరుకుంటున్నారో, అక్టోబర్ 7న జరిగిన దాడిపై ఎవరు సంతోషంగా ఉన్నారో, యూకేలో ఎన్నికైన వారిపట్ల తనకు ఆందోళన ఉందటూ తెలిపారు.
Also Read: ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. రన్‌వేపై కూలిన విమానం.. వీడియో వైరల్!
అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని.. పాలస్తీనా మద్దతుదారులు కాలేజ్ క్యాంపస్‌లలో నిరసనలు చేయడాన్ని ఆయన విమర్శించారు. వీటి గురించి మనం ఏం చేయబోతున్నామని ప్రశ్నించారు. అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకురావాలని, ఎన్నికల్లో గెలవాలని కోరుతున్నారంటూ చిప్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో 51 మిలియన్ల మంది విదేశీయులు ఉన్నారని.. వాళ్లకు 20 నుంచి 25 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారని.. అమెరికా చరిత్రలోనే ఇది అత్యధిక విదేశీయుల జనాభా అని తెలిపారు.
షరియా చట్టం
షరియా అంటే ఇస్లాం న్యాయవ్యవస్థ. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల (ఆదేశాలు) ఆధారంగా ఈ షరియా చట్టాన్ని రూపొందించారు. ఇందులో, దొంగతనం, అత్యాచారం, హత్యల్లాంటి నేరాలకు విధించే శిక్షలు, ఎలాంటి ఆహారం తినాలి, అలాగే వివాహం, విడాకులు, వారసత్వ హక్కులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. షరియా చట్టంలో మహిళలపై అణిచివేత ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం మహిళలు తమ శరీరాన్ని పూర్తిగా వస్త్రాలతో కప్పేయాలి, హిజాబ్ లేదా బుర్ఖా ధరించి మాత్రమే బయటకు రావాలి. మహిళలు చదవుకోవడం, ఉద్యోగం చేయడం లాంటి హక్కులను కూడా ఈ షరియా చట్టం హరిస్తుంది.
US Republican Chip Roy:
Is anybody paying attention to what’s happening in London?! You've got a massive Muslim takeover of the UK going on right before our eyes....They want sharia & getting elected. We have 51 million born in America and they 20-25 million kids. Highest number… pic.twitter.com/pvyBVKd5kl
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2024
Also Read: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే!