Sharia law: 'సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు'? కాంగ్రెస్, బీజేపీ మధ్య ముదురుతున్న వార్!
హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.