YCP : మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!

గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది. అందులో భాగంగా.. నవరత్నాలను అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం.

New Update
YCP : మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!

CM YS Jagan : ఏపీలో సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణతో పాటు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. ఎన్నికల ప్రచారం(Election Campaign) ముందు నుంచి కూడా దూకుడు ప్రదర్శిస్తోన్న అధికార పార్టీ వైసీపీ(YCP)... తాజాగా ఎన్నికల మేనిఫెస్టో పై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది.

అందులో భాగంగా.. నవరత్నాలను అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం. ఈ క్రమంలోనే మరికాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారు. . అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం.

ఈసారి పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ‌తంలో కంటే ప్రతి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో వుంటుంద‌ని వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఉండబోతోంది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also read: టేస్ట్‌ అట్లాస్‌ బెస్ట్‌ స్టివ్స్‌ జాబితాలో తొమ్మిది భారతీయ రుచులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు