CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్‌తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు.

New Update
CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం

CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయాల్లో మేడిగడ్డ, కృష్ణ జలాల వివాదంపై నడుస్తున్నాయి. అసెంబ్లీలో KRMB పై చర్చలు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రావడం లేదు అని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే KRMB ని కేంద్రానికి అప్పగించిందని ఆరోపణలు చేస్తోంది.

ALSO READ: బాల్క సుమన్‌ అరెస్ట్‌ తప్పదా?

చలో నల్గొండ...

ఇదిలా ఉండగా కృష్ణ జలాల వివాదంపై బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చలో నల్గొండ కార్యక్రమం చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుతు అవుతున్నారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు చలో నల్గొండ సభకు బయలు దేరారు.

మేడిగడ్డకు కాంగ్రెస్ నేతలు..

కుంగిపోయిన మేడిగడ్డ ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనపై ట్విట్టర్ (X) వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో.." తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు… పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు… వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది." అంటూ రాసుకొచ్చారు.


DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు