Prodduturu: ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..!

ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్‌ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్‌ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్‌ కక్ష పెంచుకుని దాడికి దిగాడు.

author-image
By Bhavana
New Update
Prodduturu: ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..!

Prodduturu: కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఆరవేటి థియేటర్ ఎదురుగా ఉన్న టీ స్టాల్‌ వద్ద వైసీపీ , టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. గౌస్‌ మోహిద్దీన్‌ అలియాస్‌ అవతార్‌ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్‌ అనే టీడీపీ నాయకుడు దాడి చేశారు.

ఖలీల్‌ టౌన్‌ బ్యాంకు డైరెక్టర్‌ గా పని చేస్తున్నాడు. జూన్‌ 7 న సినీహబ్‌ దగ్గర వైసీపీ , టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో కత్తితో దాడి చేశాడనే అభియోగంతో గౌస్‌ పై పోలీసులు 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఖలీల్‌ చెప్పడంతోనే తన మీద కేసు నమోదు అయ్యిందని గౌస్ కక్ష పెంచుకోవడంతో పాటు అతని మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాల వారు పరస్పరం దాడులకు దిగడంతో పాటు టూ టౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ కు మరో స్టాప్‌!

Advertisment
తాజా కథనాలు