Asha Sharath: సిద్దిఖీ అలాంటి వ్యక్తి కాదు.. అండగా నిలిచిన 'దృశ్యం' స్టార్
సీనియర్ నటుడు సిద్దిఖీ తనను వేధింపులకు గురిచేశాడని వస్తున్న వార్తలను నటి ఆశా శరత్ ఖండించారు. సిద్దిఖీ తనకు మంచి స్నేహితుడని. తన పట్ల ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.