Jabardasth Vinod : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో బాగా ఫేమస్ అయిన వారిలో వినోద్ ఒకరు. చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మాయిలాగే ఉంటాడు వినోద్. మొదట్లో చాలా మంది అతనిని చూసి అమ్మాయే అనుకున్నారు కూడా. అంతలా తన లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు.
ఇక పెళ్లి తర్వాత గత కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న వినోద్..తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే జబర్దస్త్ వినోద్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అతని భార్య విజయ లక్ష్మీ గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు గ్రాండ్ గా సీమంతం నిర్వహించారు.
Also Read : N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్ ఇదే..!
ఇందుకు సంబంధించిన ఫొటోలను వినోద్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు జబర్దస్త్ వినోద్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram