స్క్రీన్ పై నేను, ఆ హీరో బాగా కనిపిస్తాము..! రాశీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబుతో కలిసి చేయాలనే తన కోరికను బయటపెట్టింది.
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబుతో కలిసి చేయాలనే తన కోరికను బయటపెట్టింది.
కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్ట్-1 లో మీరు చూసింది 10 శాతమే. రెండో భాగంలో 100 శాతం చూస్తారు. కథలో అసలు మలుపు పార్ట్ 2లోనే ఉంది. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుంది. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నానని అన్నారు.
హర్ష సాయిని సపోర్ట్ చేస్తూ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఫేక్ ఆడియోస్, ఫేక్ సాక్షాలు సృష్టించి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆయనపై 72 BNS, 356 (1) BNS 67 of IT Act 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
'గేమ్ ఛేంజర్' టీజర్ దసరాకు వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను ఓ అభిమాని టీజర్ గురించి అడిగాడు. పోస్ట్ ప్రోడక్షన్ పనుల వల్ల టీజర్ ఆలస్యం అవుతుంది. దసరా వరకు అవ్వకపోతే దీపావళికి ఉంటుందని తెలిపాడు.
హిందీ బిగ్ బాస్ 18లో గాడిద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం షాక్ కు గురి చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సల్మాన్ ఖాన్.. హౌస్లో 'గధ్రాజ్' అనే గాడిదను ఆహ్వానించారు. దీన్ని చూసిన ఆడియన్స్ అది జంతు హింస అని బిగ్ బాస్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల ‘విశ్వం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘వెంకీ’ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ సీక్వెల్ ఎవరితో చేస్తాననేది చెప్పడం కష్టం. ప్రస్తుతం చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కామెడీతో అలరిస్తున్నారు.
బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ రాయల్ క్లాన్ సభ్యులకు భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ క్లాన్ సభ్యులంతా కలిసి రాయల్ క్లాన్ లోని ఇద్దరిని నామినేట్ చేయాలని షాకిచ్చాడు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.
బుల్లితెర యాంకర్ అనసూయ తాజాగా భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అనసూయ సంప్రదాయ వస్త్రాలంకారణలో మెరిసింది.
బుల్లితెర హిట్ పెయిర్ సుడిగాలి సుధీర్-రష్మీ వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఓ షోలో రష్మిని.. సుధీర్ కి ఫోన్ చేసి 10 వేలు అడగమని చెప్పగా.. ఆమె ఫోన్ చేసి అడుగుతుంది. ఇక రష్మీ అడగ్గానే వన్ మినిట్ లో సుధీర్ అమౌంట్ పంపడం అందరి దృష్టిని ఆకర్షించింది.