యష్మీకి మాటల్లేవ్..! అవినాష్, రోహిణీ బుల్లెట్ పాయింట్స్.. రాయల్ క్లాన్ కు భారీ ట్విస్ట్ బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ రాయల్ క్లాన్ సభ్యులకు భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ క్లాన్ సభ్యులంతా కలిసి రాయల్ క్లాన్ లోని ఇద్దరిని నామినేట్ చేయాలని షాకిచ్చాడు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. By Archana 08 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8 Promo: ఒకేసారి 8 ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో బిగ్ బాస్ సీజన్ ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పాత కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు. హరితేజ.. పృథ్వీ, యష్మీని నామినేట్ చేయగా.. గౌతమ్, నయని పావని కూడా పృథ్వీ, యష్మీ, విష్ణు ప్రియను నామినేట్ చేశారు. ఇక తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాయల్ క్లాన్ సభ్యులకు (వైల్డ్ కార్డ్స్) బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చినట్లుగా ఇచ్చారు. Also Read: హరితేజ VS పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ నామినేషన్ గోల.. బుక్కైన అవినాష్..! రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలి అయితే వీకెండ్ ఎపిసోడ్ లో అవినాష్, గంగవ్వ టాస్క్ విన్ అవడంతో రాయల్ క్లాన్ సభ్యులు ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. దీంతో వాళ్ళు ఈ వారం సేఫ్ అనుకోని హ్యాపీగా ఉండగా.. భారీ ట్విస్ట్ ఇచ్చాడు . బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఓజీ క్లాన్ సభ్యులంతా కలిసి రాయల్ క్లాన్ లోని ఇద్దరిని నామినేట్ చేయాలని షాకిచ్చాడు. దీంతో పాటు నామినేషన్ ప్రక్రియలో భాగంగా పృథ్వ, అవినాష్, రోహిణి, యష్మీ మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగినట్లుగా ప్రోమోలో చూపించారు. పృథ్వీ ఓడిపోతే మీరు ఎందుకు ఏడ్చారు..? గేమ్ లో ప్రేరణ పృథ్వీకి హెల్ప్ చేయలేదని ఆమె పై కోప్పడడం కరెక్టా..? అంటూ రోహిణి అడిగన ప్రశ్నలకు యష్మీ సమాధానం చెప్పలేకపోయింది. ఆ తర్వాత అవినాష్ కూడా యష్మి, పృథ్విని నామినేట్ చేశాడు. ప్రతీసారి నామినేషన్స్ లో తన పాయింట్స్ స్ట్రాంగ్ చెప్పే యష్మీ .. రోహిణి, అవినాష్ ప్రశ్నలకు సైలెంట్ అయిపోయినట్లుగా ప్రోమోలో కనిపించింది. మరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. Also Read: సుధీర్- రష్మీ ఫోన్ కాల్ లీక్..! ఇద్దరి మధ్య బంధం ఇదే మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి