గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకుంది.
సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయమే ఉండటంతో మెగా ఫ్యాన్స్ అంతా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు కన్ఫర్మ్ చేశారు. దసరాకు టీజర్ వస్తుందని న్యూస్ కూడా వచ్చింది. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగా ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
Also Read : బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గాడిద ఎంట్రీ.. షాక్ అయిన ఆడియన్స్
'గేమ్ ఛేంజర్' టీజర్ ఎప్పుడు వస్తుందంటూ ఓ అభిమాని థమన్‌ను ఎక్స్ వేదికగా అడిగాడు.' టీజర్ మీద దృష్టి పెట్టండి.. సాంగ్స్ తర్వాత విడుదల చేస్తారు' అంటూ థమన్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి థమన్ సమాధానమిస్తూ..' డియర్ బ్రదర్.. మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వీటికి టీజర్ బ్రేక్ వేస్తుంది.
Bro @TweetRamCharan WE understand
— thaman S (@MusicThaman) October 8, 2024
But The film is so huge Post Production Activities are on Larger Scale For Uncompromising Outputs ..
this teasers and content delivers are putting Brakes
With the flow Duseerah ki kaalapothee Diwali blast Untundhiiii 💥💥💥💥🧨
We also Want to… https://t.co/AQbRvUSWdQ
దీపావళికి కన్ఫర్మ్ గా..
మేము ఎంత వేగంగా చేసిని దసరా వరకు అవ్వకపోతే.. దీపావళికి ఖచ్చితంగా బ్లాస్ట్ ఉంటుంది. మేము కూడా దీన్ని పార్క్ నుంచి బయటకు కొట్టాలి అనుకుంటున్నాం. దీనికోసం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను..' అంటూ అభిమానికి రిప్లై ఇచ్చాడు. థమన్ చెప్పిందాన్ని బట్టి చూస్తే దసరాకు 'గేమ్ ఛేంజర్' టీజర్ లేనట్లే అని అర్థమవుతుంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగిపోయారు.