/rtv/media/media_files/9cow6n0ReFGz6v8wfJgi.jpg)
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రెజెంట్ తెలుగులో సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. అటు ఇతర భాషల్లోనూ లేటెస్ట్ సీజన్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో హిందీ బిగ్ బాస్ సీజన్ 18 అక్టోబర్ 6, 2024న గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ లో మొత్తం 19 మందిని హౌస్ లోకి ఆహ్వానించారు.
ఆ 19 మందిలో ఓ గాడిద కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం అందర్నీ షాక్ కు గురి చేసింది. బిగ్ బాస్ 18 కు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్‌లో 'గధ్రాజ్' అనే గాడిదను ఆహ్వానిస్తూ.. నీవు ఈ షోలోకి రావాలని పిలిచినప్పుడు.. నర్వెస్ అయ్యావా? అని అంటే.. గట్టిగా ఆరించింది. దాంతో నర్వెస్ కాలేదా.. అయితే ఒకే.. ఈ ఇంటిలో నీవు మంచి కంటెస్టెంట్‌గా ఉండాలి. బాగా టాస్కులు ఆడాలి అని సల్మాన్ సూచించాడు.
Also Read : 'వెంకీ 2'.. రవితేజ కాకుండా ఆ హీరోతో చేస్తా : శ్రీనువైట్ల
ఇది మరీ టూ మచ్..
ఎవరైనా నిన్ను ఏదైనా అంటే ఏడ్వ కూడదు అని బుజ్జగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన కొందరు ఆడియన్స్ బిగ్ బాస్ లోకి గాడిదను కంటెస్టెంట్ గా ఆహ్వానించడం ఏంటని అంటుంటే.. మరికొందరేమో బిగ్ బాస్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Bigg Boss shuru hone se pehle hi aa gaya ek twist. Kya yeh donkey bhi hai in the participant list? 🫏 🤔
— JioCinema (@JioCinema) October 4, 2024
Watch #BiggBoss18 Grand Premiere 6 October raat 9 baje on @ColorsTV and #JioCinema#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss18 #BiggBoss @BeingSalmanKhan pic.twitter.com/lRvR2ljXjT
అది జంతు హింస అని, అసలు ఒక జంతువుని బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం మరీ టూ మచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి గాడిదను కంటెస్టెంట్‌గా పంపి బిగ్ బాస్ ఎలాంటి ఆటను ఆడిస్తాడో చూడాలి. కాగా బిగ్ బాస్ సీజన్ 18 కలర్స్ టీవీతో ప్రసారం అవుతుంది. దాంతో పాటూ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.