'వెంకీ 2'.. రవితేజ కాకుండా ఆ హీరోతో చేస్తా : శ్రీనువైట్ల డైరెక్టర్ శ్రీను వైట్ల ‘విశ్వం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘వెంకీ’ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ సీక్వెల్ ఎవరితో చేస్తాననేది చెప్పడం కష్టం. ప్రస్తుతం చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కామెడీతో అలరిస్తున్నారు. By Anil Kumar 08 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి శ్రీను వైట్ల - రవితేజ కాంబోలో వచ్చిన 'వెంకీ' సినిమాకు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. 2004 లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ కు అన్ లిమిటెడ్ ఫన్ అందించింది. దాంతో సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా 'వెంకీ' క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ వీరి కాంబోలో 'వెంకీ' సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఏ హీరోతో చేస్తారనే ప్రశ్నకు శ్రీను వైట్ల సమాధానమిచ్చారు. ఆయన తాజా చిత్రం ‘విశ్వం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘వెంకీ’ గురించి మాట్లాడారు." వెంకీ సీక్వెల్ ఎవరితో చేస్తాననేది చెప్పడం కష్టం. అందులో నటించే హీరో కచ్చితంగా నాకు మంచి స్నేహితుడై ఉండాలి. రవితేజ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ సినిమా అంత బాగా వచ్చింది. నేను ఏ హీరోతో చేసినా వాళ్లు నాకు స్నేహితులు అవుతారు. ఒకరి పేరు చెప్పడం కష్టం.. అలాంటి రిలేషన్ ఉన్నప్పుడే సినిమా బాగా వస్తుంది. ప్రస్తుతం చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. వాళ్లందరూ కామెడీతో అలరిస్తున్నారు. వాళ్లలో ఎవరికైనా దీని సీక్వెల్ సెట్ అవుతుంది. ఒకరి పేరు చెప్పడం కష్టం" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Director @SreenuVaitla about making a sequel for the #Venky movie. #Viswam #ViswamPreReleaseEvent pic.twitter.com/Bz4UVQnUoO — Telugu Chitraalu (@TeluguChitraalu) October 7, 2024 ఇక 'విశ్వం' సినిమా విషయానికొస్తే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. సుమారు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ఈ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : బీజేపీకి ఊహించని పరాజయం! #tollywood #raviteja #srinuvaitla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి