ఇండస్ట్రీలోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, తక్కువ సమయంలోనే పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్న యంగ్ హీరో అతను. కెరీర్ ప్రారంభంలోనే ఒక ప్రముఖ హీరోయిన్‌తో కలిసి పనిచేసిన ఈ హీరో, కొంతకాలం ఆమెతో సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ సంబంధం త్వరలోనే ముగిసింది. ఆ తర్వాత మరో నటితో ఆయనకు సంబంధం ఉన్నట్టు గాసిప్స్ వినిపించినప్పటికీ, ఆ వార్తలు ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు, ఈ హీరో తన లేటెస్ట్ మూవీలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ తో అతనికున్న సన్నిహిత్యంపై చర్చ జరుగుతోంది. Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! ఇంతకీ హీరోయిన్ ఎవరంటే.. తన తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ హీరో, హీరోయిన్ ఇద్దరూ చాలా దగ్గరవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిద్దరికీ సంబంధించి రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అదేంటంటే.. ఓ సినిమాకు సంబంధించి విదేశాలలో జరిగిన ఒక షెడ్యూల్ లో ఈ హీరోయిన్ తనకు ఏ సీన్లు లేకపోయినా, షూటింగ్ మొత్తం ముగిసే వరకు అక్కడే ఉన్నట్టు సమాచారం. Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! హీరో పనులు పూర్తయ్యాకే ఆమె స్వదేశానికి తిరిగొచ్చిందట. ఆమె అలా ఉండటానికి కారణం కేవలం హీరోతో ఉన్న రిలేషనే అని కొందరు పరిశ్రమలో చెబుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచిన ఆ హీరో.. ఇప్పుడు మరో హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తుండటంపై టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.