WAR 2 OTT: ‘వార్ 2’ ఇప్పుడు OTTలో.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ సినిమా అక్టోబర్ 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ పొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ OTT ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

New Update
WAR 2 OTT

WAR 2 OTT

WAR 2 OTT: జూనియర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ తాజాగా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా విడుదల తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

అయితే ఇప్పుడు ‘వార్ 2’ OTTలోకి వస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9 (రేపటి నుంచే) ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రాబోతోంది. ఇది తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

8 వారాల థియేట్రికల్ గ్యాప్ తరువాత OTTకి

ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిదవ వారం తర్వాత ఓటిటీలోకి రాబోతోంది. అయితే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే థియేటర్లలో బాగా ఆకట్టుకోని ఈ సినిమా OTT ప్రేక్షకులపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో అనే అంశం.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, అశుతోష్ రానా కీలక పాత్రలో కనిపిస్తారు. సినిమా చివర్లో బాబీ డియోల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మించారు. సంగీతాన్ని పృతమ్, సంచిత్ బాల్హరా, అంకిత్ బాల్హరా కలిసి అందించారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

తొలిసారి ఎన్టీఆర్ బాలీవుడ్ మాస్ యాక్షన్ స్పై యూనివర్స్‌లో అడుగుపెట్టిన సినిమా ఇది. అలాగే హృతిక్ రోషన్ తన గెటప్‌లో ప్రేక్షకులను అలరించాడు. థియేటర్లలో మిక్స్డ్ టాక్  వచ్చినా, కొన్ని సినిమాలు ఓటిటీలో సైలెంట్ గా హిట్ అవుతుంటాయి. ‘వార్ 2’ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ‘వార్ 2’ను చూసే అవకాశం వచ్చింది. కథ, యాక్షన్, OTT ఆడియెన్స్‌కి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి!

Advertisment
తాజా కథనాలు