War 2 Movie Flop: వార్ 2 డిజాస్టర్.. సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీ మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్‌ను సంపాదించుకుంది. ఏ భాషలో కూడా వార్ 2 కు మంచి టాక్ రాలేదు. వార్‌లో ఉన్న అయాన్ ముఖర్జీ మార్క్ వార్ 2లో లేదని టాక్ వినిపిస్తోంది.

New Update

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్ 2 మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా కనిపించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్‌ను సంపాదించుకుంది. వార్2 మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఏ భాషలో కూడా వార్ 2 కు మంచి టాక్ రాలేదు. వార్‌లో ఉన్న అయాన్ ముఖర్జీ మార్క్ వార్ 2లో లేదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్‌లో నటించారు. దీంతో ఈ మూవీపై ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే వార్ 2 మూవీ ఫ్లాప్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Coolie Review: 'కూలీ' ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ భయ్యా.. సినిమా ఎలా ఉందంటే!

పూర్ విజువల్ ఎఫెక్ట్

సినిమాలో పూర్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే టెక్నికల్‌గా కూడా ‘వార్-2’ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లు లేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఊహించారు. కానీ విజువల్స్, టెక్నికల్‌గా సరిగ్గా లేకపోవడం కూడా ఫ్లాప్‌కి ఓ కారణం అని చెప్పవచ్చు.

ఎమోషనల్ సీన్లు లేవు
వార్ 2 మూవీలో ఎక్కువగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. తెలుగు సినిమాలా ప్రేక్షకులకు అనిపించదు. యాక్షన్ మూవీలు అంటే ఇష్టం ఉండేవారికి, బాలీవుడ్, హాలీవుడ్ వారికి వార్ 2 నచ్చుతుంది. ఈ మూవీలో పెద్దగా ఎమోషనల్ సీన్లు లేకపోవడం కూడా సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు.

కిక్కు ఇవ్వని పాటలు
సినిమాలో ప్రేక్షకులకు కిక్కిచ్చే పాటలు అయితే లేవు. చివరకు నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రానే ఉంది. సినిమా స్క్రీన్ ప్లే, స్టోరీలో కొత్తదనం లేకపోయినా పాటలు బాగుంటే.. కొంతవరకు గట్టెక్కవచ్చు. కానీ పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. 

నమ్మలేని యాక్షన్ సీన్లు
వార్ 2లో ఎక్కువగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని యాక్షన్ సీన్లు నమ్మశక్యంగా లేవు. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ, అనిల్ కపూర్ పాత్రలకు అసలు ప్రాధాన్యత లేదు. 

కనపడని అయాన్ ముఖర్జీ డైరెక్షన్
అయాన్ ముఖర్జీ డైరెక్షన్ మార్క్ కనిపించలేదు. ‘వార్’ ఔట్ పుట్‌తో పోలిస్తే ‘వార్-2’లో అయాన్ నరేషన్ బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇవన్నీ కూడా వార్ 2 మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలనే చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి: War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ

Advertisment
తాజా కథనాలు