/rtv/media/media_files/2025/08/10/war-2-censor-report-2025-08-10-16-23-57.jpg)
WAR 2 Censor Report
- War 2లో కియారా అద్వానీ 9 సెకన్ల బికినీ సీన్‌కి కోత విధించిన CBFC
- 'సెన్సువల్ సీన్స్' తగ్గించమని సెన్సార్ సూచన
- కియారా ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడింది
- ఆమె తల్లిగా మారిన తర్వాత War 2 ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది.
- ఈ నెలలో ఆమె భర్త సిద్ధార్థ్ సినిమా Param Sundari కూడా రిలీజ్ అవుతోంది
- War 2క రజనీకాంత్ ‘Coolie’ సినిమాతో పోటీ పడనుంది.
#War2: 10 minutes trimmed by the censor board, including a bikini sequence pic.twitter.com/dKl7pcHfWB
— Ayyappan (@Ayyappan_1504) August 10, 2025
Also Read: 'వార్ 2'ని ప్రమోట్ చేయడానికి కియారా తప్ప ఏం లేదా..? ఈ BTS వీడియో చూస్తే..!
WAR 2 Censor Report:
హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్(jr NTR), కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా War 2 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే సెన్సార్ బోర్డు (CBFC) ఈ సినిమాలోని కొన్ని సీన్లకు కత్తెర వేసినట్టు తెలుస్తోంది.
War 2 మూవీ టీమ్ సుమారు 10 నిమిషాల సీన్లను కట్ చేసిన వెర్షన్‌ను CBFCకు పంపినప్పటికీ, బోర్డు మరోసారి CBFC కొన్ని సీన్స్‌ను తొలగించాలని చెప్పింది. ముఖ్యంగా, కియారా అద్వానీ బికినీలో కనిపించే పూల్ సీన్‌ను కొంత మేర తగ్గించాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది.
టీజర్‌లో, అలాగే ‘ఆవన్ జావన్’ అనే పాటలో కియారా అద్వానీ లుక్‌కి మంచి స్పందన వచ్చినప్పటికీ, ఆ పాటలోని 9 సెకన్ల "సెన్సువల్ విజువల్స్"ను తీసేయండి అని CBFC చెప్పిందట. దీనివల్ల కియారా అద్వానీ బికినీ సీన్ కొంత కోతకు గురవుతుందన్న మాట.
కియారా అద్వానీ ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది, వ్యాయామాలు, ప్రత్యేకమైన డైట్ పాటించి ఫిట్‌నెస్‌ను సాధించింది. ఆ పాట బీహైండ్-ది-సీన్స్ వీడియోలతో ఆమె లుక్‌కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఆ సీన్లను తొలగించడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ
పడుతున్నారు.
Also Read: 'వార్ 2' సాంగ్ వచ్చేసింది.. 'నాటు నాటు' రేంజ్ డాన్స్ తో కుమ్మేసారుగా..!
ఇదిలా ఉండగా, కియారా అద్వానీ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బిడ్డతో గడుపుతోంది. ఇప్పుడామె తల్లి కావడం ఒక విశేషం అయితే, తాను నటించిన సినిమా విడుదలవుతుండడం మరో విశేషం. ఈ విషయంలో కియారా అద్వానీ చాలా సంతోషంగా ఉంది.
ఇక మరోవైపు, సిద్ధార్థ్ నటిస్తున్న Param Sundari అనే రొమాంటిక్ సినిమా కూడా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఇందులో ఆయన జాన్వి కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. అంటే ఈ నెలలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ ఇద్దరూ తమ తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
ఇక War 2 సినిమాకి మరో పెద్ద పోటీ రజనీకాంత్ నటిస్తున్న "Coolie". ఈ రెండు సినిమాల మద్య గట్టి పోటీ జరగనుంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రజినీకాంత్ కూలీ, War 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన రాబట్టుకుంటాయో చూడాలి.