War 2 Song Teaser: 'వార్ 2' సాంగ్ వచ్చేసింది.. 'నాటు నాటు' రేంజ్ డాన్స్ తో కుమ్మేసారుగా..!

పాన్ ఇండియా మూవీ 'వార్ 2' సినిమా నుంచి 'సలాం అనాలి' అనే సాంగ్ టీజర్‌లో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్టెప్పులతో అదరకొట్టారు. ఈ సాంగ్ టీజర్ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచేస్తూ, యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

New Update

War 2 Song Teaser:

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ నుంచి తాజాగా సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సలాం అనాలి' (War 2 Salaam Anali Song Teaser)అటూ సాగిన ఈ పాటకి అదిరిపోయే స్టెప్పులతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ కుమ్మేసారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేయడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. 'సలాం అనాలి' అనే ఈ పాట టీజర్‌ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా, వార్ 2 సినిమా ఆగస్టు 14న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, పాటలు, హీరోల కాంబో ఇలా అన్ని విషయాల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.