/rtv/media/media_files/2025/08/07/kiara-advani-war-2-2025-08-07-08-36-21.jpg)
Kiara Advani War 2
Kiara Advani War 2: హాలీవుడ్‌లో కొత్త టెక్నాలజీలతో ఫిల్మ్ మేకింగ్ లో ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో CGI, AIలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీలు బాలీవుడ్ కి కూడా అంటుకున్నాయి. చాలా మంది తమ పనిని వేగవంతం చేయడానికి, సినిమా క్వాలిటీ కోసం ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు.
అయితే, కొన్నిసార్లు ఈ టెక్నాలజీలు ఒరిజినల్ షాట్స్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడతాయి. ఇటీవల, 'వార్ 2' సినిమా ప్రమోషనల్ టీజర్‌లో కియారా అద్వానీ ఒక బికినీ షాట్‌పై చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఈ షాట్ నిజంగా చిత్రీకరించిందా లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) వాడారా అని అనుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.
తాజాగా, 'వార్ 2' చిత్ర బృందం ఈ అనుమానాలను క్లారిఫై చేస్తూ ఒక 'బిహైండ్ ది సీన్స్' (BTS) వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో, కియారా ఈ షాట్ కోసం ఎలా రెడీ అయ్యింది, ఎలా షూట్ చేశారన్నది స్పష్టంగా చూపించారు. దీనితో, ఆ బికినీ షాట్ CGI కాదని, నిజంగానే చిత్రీకరించారని అందరికీ క్లారిటీ వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్.. Kiara Advani BTS Viral Video
ఈ BTS వీడియో చూసిన తర్వాత, కియారా ఈ షాట్ కోసం ఎంత కష్టపడిందో తెలుస్తోంది. ఈ షాట్ మొదట టీజర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత, ఈ BTS వీడియోతో మరింత మంది దీని గురించి చర్చించుకుంటున్నారు.
అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర నటులు ఉన్నా, సినిమా ప్రచారంలో కియారా అద్వానీ ఆ ఒక్క బికినీ షాట్ ఫుల్ ఫేమస్ అయ్యింది. మొదట అందరి దృష్టి హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉండగా, కియారా గ్లామరస్ బీచ్ లుక్ మెయిన్ అట్రాక్షన్ గా మారింది.
They literally released her bikini BTS 🥵🤯#KiaraAdvanipic.twitter.com/5lr4l0Yeir
— Kajalmyqueen (@unknownguyitis) August 6, 2025
ప్రస్తుతం సినిమా మార్కెటింగ్‌లో కియారా బీచ్ సీన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సినిమా ప్రొమోషన్స్ కి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. కియారా వైరల్ మూమెంట్ తో సినిమాకు కావాల్సిన పబ్లిసిటీని భారీగా అందుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో కియారా పాత్ర, ఆమెపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అయితే ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెడుతూ కియారా ఈ సినిమాకి ఫుల్ బజ్ తెచ్చి పెడుతోంది.
అయితే వార్ 2 సినిమా ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. రజినీకాంత్ కూలీ తో పాటు పోటీగా వార్ 2 రానుంది. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.