సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి

సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

New Update
vijayashanti about sandhya theatre incident

vijayashanti about sandhya theatre incident

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి తెర లేపింది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటన గురించి మాట్లాడారో.. అప్పటినుంచి రాజకీయ నాయకులంతా దీని గురించే మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

తాజాగా ఈ ఘటనపై పై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె.. రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చూడండి:  Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్

 అనుకూలంగా మలుచుకుంటున్నారు..

విజయశాంతి తన ఎక్స్ లో పోస్టు చేస్తూ.." సినిమా విడుదల సమయంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమే. ఈ దురదృష్టకర ఘటనను తమకు అనుకూలంగా  మలుచుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నేతల ప్రకటనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 

కొందరు కేంద్రమంత్రులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసి, సినిమా పరిశ్రమను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ఖండించదగిన విషయం. సినిమా పరిశ్రమకు ప్రజల అందరి మద్దతు అవసరం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమస్యలను సక్రమంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగాలి.." అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు